మన టివి 6 న్యూస్ (మనప్రాంత వార్తలు మన కోసం 13/02/2025 గురువారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యనగూడెం పంచాయతీ పరిధిలోని నాయకులగూడెం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకుని తక్షణమే స్పందించిన 108 సిబ్బంది టెక్నీషియన్ రామకృష్ణ, పైలట్ రాధాకృష్ణ సమయస్ఫూర్తితో వ్యవహరించి క్షతగాత్రులను పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మండల పరిధిలోని కందిమల్ల వారి బంజర గ్రామానికి చెందినటువంటి కూలీల ఆటోను టాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఆటోలో 10 మంది కూలీలు ఉండగా ముగ్గురికి గాయాలకు అయ్యాయి. వీరిలో తుమ్మలపల్లి మురళీకృష్ణ తండ్రి రాంబాబు. (25 సంవత్సరాలు) పరిస్థితి విషమంగా ఉంది. బత్తుల వెంకమ్మ, కంప మారెమ్మ కు తీవ్ర గాయాలు.
చండ్రుగొండ సమీపంలో మొక్కజొన్న చేలో కూలికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
