మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 28/02/2025 శుక్రవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ పోలీస్ స్టేషన్ లో 2020 సం. నమోదు అయిన యువతి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు పది వేల రూపాయల జరిమానా విధిస్తూ సత్తుపల్లి VI ADJ మేజిస్ట్రేట్ ఎం శ్రీనివాస్ 27వ తేదీ గురువారం తీర్పును వెలువరించినట్లు సత్తుపల్లి రూరల్ సిఐ ముత్తలింగయ్య తెలిపారు.
ఈ కేసులో నిందితుడికి శిక్షపడే విధంగా పని చేసిన అప్పటి సిఐలు సురేష్ కుమార్, రవికుమార్, కరుణకర్, ప్రస్తుత సిఐ మత్తు లింగయ్య, పెనుబల్లి ఎస్సై వెంకటేశ్ ను APP అబ్దుల్ బాషా, కోర్టు కానిస్టేబుల్ గిరి ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

Source:mana tv6 news
Tags:డైలీ న్యూస్