మన టీవీ 6 న్యూస్ – ఖమ్మం రూరల్ ( లోకల్ న్యూస్ జులై 09). తెలంగాణ రాష్ట్రంలో నాయిబ్రాహ్మణలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని నాయి బ్రాహ్మణుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా కన్వీనర్ నంద్యాలనరసింహరావు ప్రభుత్వాన్ని కోరారు.మండల పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్ లో నాయిబ్రాహ్మణల సంక్షేమ సంఘం సమావేశం మంగళవారం నిర్వహించారు.
ఈ సమావేశంలో వీరబ్రహ్మం మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనలో నాయి బ్రాహ్మణుల పాత్ర ఎంతో ఉందని గుర్తు చేశారు. నాయి బ్రాహ్మణులను ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక ప్యాకేజి కింద సంక్షేమ పథకాలు, ప్రత్యేక నిధులు మంజురు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కన్వీనర్ నంద్యాల నరసింహరావు, శ్రీనివాస్ రావు,పట్టణ అధ్యక్షులు జగదీష్ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ మండల, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయి బ్రాహ్మణుల సంక్షేమ సంఘం నూతన కమిటీలను ఎన్నుకున్నారు.
ఖమ్మం రూరల్ మండలాధ్యక్షుడిగా నంద్యాల వీరబ్రహ్మంను, ప్రధాన కార్యదర్శిగాగుదిమల్ల వెంకటనారాయణ,ఏదులాపురం మున్సిపాలిటీ అధ్యక్షులుగా నంద్యాలనాగేశ్వరరావు, కార్యదర్శిగా మాదారపు సైదులు,గౌరవ అధ్యక్షులుగా సురభి వెంకన్న, ఉపాధ్యక్షుడిగా దర్గయ్య, నాగేశ్వరరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వైరా పట్టణ అధ్యక్షులు కే.వెంకటేశ్వర్లు,పట్టణ గౌరవ అధ్యక్షులు సురభి సైదులు,సహాయ కార్యదర్శి సందీప్ తదితరలు పాల్గోన్నారు.
