మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం). ఖమ్మం జిల్లా పెనబలి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని రంగారావు బంజర గ్రామానికి చెందినటువంటి ఇమ్మడి భాస్కర్ (58సం.) పక్కనే ఉన్న ఎడ్ల బంజర గ్రామంలో జాతీయ రహదారి దాటుతూ ఉండగా కొత్తగూడెం నుండి విఎం బంజర్ వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన భాస్కర్ హుటాహుటిన పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. విఎం బంజర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Source:mana tv6 news
Tags:బ్రేకింగ్ న్యూస్