google-site-verification: google78487d974c7b676c.html
Daily News

తుమ్మల కృషి…. రైతన్నలు ఖుషి…….

20KViews

మన టివి6 న్యూస్ – పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూలై 17/25). గోదావరి నీటిని సీతారామ ప్రాజెక్టు ద్వారా తీసుకువచ్చి ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేస్తా అని అన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట నిలబెట్టుకున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్న పెనుబల్లి మండల రైతులు.

ప్రతి సంవత్సరం నాగార్జున సాగర్ డ్యాం నిండిన తర్వాత సెప్టెంబర్ లోనో, అక్టోబర్ నెలలోనూ ఖమ్మం జిల్లాకి సాగర్ నీళ్లు వచ్చేవి. కానీ ప్రస్తుతం జూలై 15 నాటికే సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలో గోదావరి జలాలు పరవళ్ళు తొక్కుతుండడంతో పాత చిన్నమ్మ గూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం రైతులు గోదారమ్మకు భక్తిపార్వశంతో పూజలు చేశారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం లోని తల్లాడ కల్లూరు పెనుబల్లి వేంసూరు మండలాలకు గోదావరి నీళ్లు చేరుకున్నాయి… అయితే ముఖ్యంగా పెనుబల్లి మండలంలో ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉండడంతో ఏ చెరువులోకి నీరు చేర రాలేదు. ప్రస్తుతం రోహిణి కార్తెను తలపించే ఎండలతో నారుమళ్లు, కరెద చల్లిన వరి పొలాలు ఎండిపోయి దిక్కుతోచన పరిస్థితులలో రైతుల కొట్టుమిట్టాడుతున్నారు. సాగర్ కాలువ ద్వారా గోదావరి జలాలు రావడంతో అవి బంగారంతో సమానంగా రైతులు భావిస్తూ తమ పొలాలను ఎండకు ఎండిపోకుండా కాపాడుకుంటున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాత చిన్నమ్మగూడెం గ్రామంలో రైతుల ఆనందాన్ని వారి మాటల్లోనే చూద్దాం.

ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు సీనియర్ నాయకులు వంకాయలపాటి వెంకటేశ్వరరావు, చీకటి రామారావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు, నున్న బాబురావు,బెల్లంకొండ వెంకటయ్య, వంకాయలపాటి పవన్ పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!