google-site-verification: google78487d974c7b676c.html
Daily News

కేటిఆర్ యాస, ప్రాస కలిపి పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోం……… ఎమ్మెల్యే రాగమయి దయానంద్.

26.6KViews

🔥కెసిఆర్ రాష్ట్రపిత కాదు… బూతుల పితా….
🔥ఇంటి ఆడబిడ్డను గౌరవించుకోలేరు… ఇంటి సమస్యలను పరిష్కరించుకోలేరు….
🔥ఒక్క ఎంపి సీటు కూడా మీరు గెలవలేక పోయారు…. అయినా బుద్ధి రాలేదు.
🔥మీ అహంకారం మీ నోటి దురుసు వలనే ఈరోజు అధికారానికి దూరమయ్యారు.
🔥తుమ్మల రాజకీయ అనుభవం అంత లేదు కేటీఆర్ వయసు….
🔥భట్టి విక్రమార్క విదేశాల నుంచి రాలేదు.. ప్రతినిత్యం ప్రజల్లో ఉన్నారు.
🔥ఈసారి సిఎం నేనే అని కలలు కంటున్న కేటీఆర్…..

మన టివి6 న్యూస్ – సత్తుపల్లి (లోకల్ న్యూస్ జూలై 20 /25). సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో కెసిఆర్, కేటీఆర్ పై హాట్ కామెంట్స్ చేసిన. సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్.

🔥అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది… ఏ మొహం పెట్టుకొని ఖమ్మం జిల్లాకి వస్తున్నావు… ఖమ్మం జిల్లా అభివృద్ధిని సర్వనాశనం చేసిన మీకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఇచ్చిన తీర్పు సరిపోదా అని ప్రశ్నించారు.

🔥కెసిఆర్, కేటీఆర్ లా హామీల గురించి మాట్లాడేది… మీరిచ్చిన హామీ దళిత ముఖ్యమంత్రి ఎక్కడ, మీరిచ్చిన హామీ దళిత బంధు ఎక్కడ, మీరిచ్చిన హామీ బీసీ బందు ఎక్కడ, మీరిచ్చిన హామీ ఇంటికొక ఉద్యోగం ఎక్కడ, మీరిచ్చిన హామీ దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడ, మీరిచ్చిన హామీ పూర్తిస్థాయిలో రుణమాఫీ ఎక్కడ.. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు హామీలు ఇచ్చి అమలు కానివి పుస్తకాలు రాయొచ్చు… అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు…

🔥మహిళలను అవమానపరుస్తూ, హేళన చేస్తూ మీరు చేసిన కామెంట్స్ కి ఒక మహిళగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను…

🔥ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నోటికి వచ్చినట్టు తిడుతున్నావ్… మీ దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనం కాదా ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇంకొక సారి అవమానపరిస్తే మా ఖమ్మం జిల్లా కార్యకర్తలే నిన్ను తరిమి తరిమి కొడతారు..

🔥మా జిల్లా మంత్రులపై నువ్వు చేసిన కామెంట్స్ సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను… మా జిల్లా మంత్రుల రాజకీయ అనుభవం అంత లేదు నీ వయసు… వారి అనుభవం ముందు నీ పిల్ల చేష్టలు ఎంత…

🔥ఈసారి మా ప్రభుత్వంపై మాముఖ్యమంత్రి పైన మామంత్రుల పైన నిరాధార ఆరోపణలు చేసిన, అవాకులు చవాకులు పేలిన నిన్ను కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి తరిమి కొడతారు… ఇలా ప్రెస్ మీట్ లో కొన్ని విషయాలపై మాట్లాడిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఇప్పుడు ఆ వివరాలు వారి మాటలను చూద్దాం…..

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!