మన టివి6 న్యూస్ – కల్లూరు మున్సిపాలిటి (లోకల్ న్యూస్ జులై 14/25). గుడ్ మార్నింగ్ సత్తుపల్లి కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఏర్పడిన కల్లూరు మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్లో గడపగడపకు తిరుగుతూ ప్రజల సమస్యలు పరిష్కారానికి మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ విజయకుమార్.
🔴 ప్రజల వద్దకే ప్రజా పాలన తీసుకొస్తున్న ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ దంపతులు.
➡️ అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులతో కలిసికల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్లో మార్నింగ్ వాక్ లో ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గం చూపుతున్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దంపతులు.

➡️ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేనే వారి ఇంటికి వచ్చి సమస్యలుఅడిగి పరిష్కరించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న కల్లూరు మున్సిపాలిటీ ప్రజలు.
➡️ పరిసరాల పరిశుభ్రత గురించి, పారిశుద్ధ్య పనులు చేయాలని అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్.

➡️ ఎమ్మెల్యే రాగమయి దయానంద్ కి కృతజ్ఞతలు తెలియజేసిన కల్లూరు మండల ప్రజలు, పంచాయతీగా ఉన్న కల్లూరు మేజర్ పంచాయతీ, మున్సిపాలిటిగా మార్చి అభివృద్ధి చేస్తుండటం పట్ల హర్ష వ్యక్తం చేస్తున్న ప్రజలు.
➡️ స్థానిక కల్లూరు మండల వాసులు, తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో, మంత్రి తుమ్మల, బట్టి ప్రోత్బలంతో, మా ఆధ్వర్యంలో తప్పకుండా కల్లూరు మున్సిపాలిటీ రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు.

ఈ కార్యక్రమం లో కల్లూరు ఏఎంసి చైర్మన్ భాగం నీరజ చౌదరి, కల్లూరు మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కల్లూరు మండల అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు.