మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 21/02/2025 శుక్రవారం).శ్రీమతి సోనియమ్మ కుటీరంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ మూడు రోజుల శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ శిబిరానికి సత్తుపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పసుమర్తి విశ్వనాథ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ సోనియమ్మ కుటీరంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ శిక్షణ శిబిరంలో సత్తుపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా అధికార పత్రాన్ని తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా ఎదగాలంటే క్షేత్రస్థాయిలో నాయకులు చేయవలసిన కార్యాచరణ, పార్టీ బలోపేతానికి చేయాల్సిన కృషి గురించి శిక్షణ శిబిరంలో తెలుసుకోవడం జరిగిందన్నారు.
ఈ మూడు రోజుల శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నేషనల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయ్ భాను చిబ్, నేషనల్ ఇన్చార్టులు, తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇన్చార్టులు, మంత్రి పొన్నం ప్రభాకర్, సి.డబ్ల్యూ.సి ప్రత్యేక ఆహ్వానితులు ఏఐసిసి కార్యదర్శి చల్లా వంశీ చందర్ రెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శివసేన రెడ్డి, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
పెద్దలందరూ ఇచ్చిన సలహాలు సూచనలన్నిటిని తప్పకుండా పాటిస్తానని, సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రజలతో అలాగే సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా దయానంద్ రాగమయి నాయకత్వంలో పార్టీ బలోపేతానికి పార్టీ సిద్ధాంతాలను అనుసరిస్తూ నాయకులుగా ఎదిగే వాళ్లను ప్రోత్సహిస్తూ సత్తుపల్లి నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చుకుంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ముందుకు వెళతానని పసుమర్తి విశ్వనాధ్ తెలియజేశారు.
