మన టివి6 న్యూస్ కు స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
సత్తుపల్లి పట్టణ కేంద్రంలో సుమారు 4,000 మంది మహిళలతో కోలాహలంగా ఆనందోత్సాహాల నడుమ ఇందిరా మహిళల శక్తి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డీ లేని రుణాల చెక్కులను, లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులను నూతన రేషన్ కార్డులను మహిళా లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనన్న, ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతుల చేతుల మీదుగా అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ….సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రెవిన్యూ గ్రుహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే మన సత్తుపల్లి నియోజకవర్గం ముందుండటం చాలా సంతోషంగా ఉందని, ఇది ప్రజలందరి సహాయ సహకారాలతోనే సాధ్యపడిందని అన్నారు. నావెంట అన్నలా ఉంటూ, ఒక చెల్లెలుగా నాకు తోడుగా ఉంటూ ఇచ్చిన మాట ప్రకారం మన సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ఉప మంత్రివర్యులు బట్టి విక్రమార్కకు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి, పొంగులేటి శ్రీనన్నకు ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న రుణాలను తీసుకొని వాటిని లాభదాయకమైన రంగాల్లో పెట్టుబడి పెట్టి తద్వారా వచ్చే ఆదాయంతో వారి కుటుంబాలు ఆర్థిక పురోగతిని సాధించాలని, మహిళలు ఈఇందిరమ్మ ప్రభుత్వంలో మహారాణులుగా ఎదిగి రాష్ట్రం మహిళా సాధికారిత సాధించే దిశగా ముందుకు వెళ్లేందుకు సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక మరెన్నో మహిళా స్వావలంబన కార్యక్రమాలు చేపడతారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటివరకు ఒక్క సత్తుపల్లి నియోజకవర్గంలోనే సుమారు 5 కోట్లు 60 లక్షలు రూపాయల వరకు మహిళా శక్తులకు
ఇందిరమ్మ ప్రభుత్వం అందించిందని అన్నారు. భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా పేద ప్రజలు సొంత ఇంటి కల నెరవేర్చడానికి 5 లక్షలు రూపాయలు ఇంటి నిర్మాణానికి విడతల వారీగా అందించడం మామూలు విషయం కాదని, గ్రామాల్లో పట్టణాల్లో పేద ప్రజల ఇంట ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో వారి ఇంట పండుగ వాతావరణం నెలకొందని మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
గత టిఆర్ఎస్ పార్టీ పాలన కాలంలో మహిళలు ఆర్థికంగా ఆదుకునే నాథుడే లేడని, వడ్డీ లేని రుణాలు ఇచ్చే దిక్కేలేదని, ఇంకా ఇళ్ల పరిస్థితి ఆదేవుడికే తెలుసు అని మంత్రి పొంగులేటి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విధానాలను ఎద్దేవా చేశారు. పేద ప్రజల కొన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్కొక్క పథకాన్ని వారికి అందిస్తూ, ఈరోజు రేషన్ కార్డులను కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో లబ్ధిదారులకు అందజేస్తున్నామని మంత్రి పొంగలేటి తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, ఎఎంసి చైర్మన్ లు, సత్తుపల్లి నియోజకవర్గం 5 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా కాంగ్రెస్ నాయకులు, సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, మహిళ, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
