మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 12/03/2025 బుధవారం).ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ST, SC సబ్ ప్లాన్ నిధులు సుమారు 24 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ శంకుస్థాపనలు మొదలుపెట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పెనుబల్లి మండలంలో సుమారు 6 కోట్లతో బ్రాహ్మలకుంట, గంగదేవిపాడు, అగ్రహారం, సూరయబంజర, రామచంద్రాపురం గ్రామాల్లో 11వ తేదీ మంగళవారం ఎమ్మెల్యే రాగమయి దయానంద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపిస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ ఫలాలను గురించి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ వివరించారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులతో పాటు పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు, సోమరాజు సీతారామరావు, చీకటి రామారావు , చీకటి చిన్న నరసింహారావు, కీసరి శ్రీనివాస్ రెడ్డి, రాజబోయిన కోటేశ్వరరావు, గూడూరు మాధవరెడ్డి, పసుమర్తి విశ్వనాథ్, షేక్ కరిముల్లా, బానోతు జగన్, మాలోతు రాధాకృష్ణ, మిట్టపల్లి కిరణ్, పాకలపేట సతీష్, గోగినేని రమేష్, మేకతోటి కాంతయ్య కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.