మన టివి6 న్యూస్- కల్లూరు మండలం (మన ప్రాంత వార్తలు మనకోసం 21/06/2025 శనివారం). రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బాఆర్ఎస్ పార్టీకి పోటీ చేయటానికి అభ్యర్థులే దొరకరని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోస్యం చెప్పారు.ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం సాయంత్రం ఘనంగా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ…..తెలంగాణ ప్రజలు గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి, బీఆర్ఎస్ కు కర్రుకాల్చి వాత పెట్టారని అన్నారు. సంక్షేమాన్ని అందిస్తున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజలు ఎల్లవేళలా అండగా ఉంటారని, కార్యకర్తల కష్టాన్ని గుర్తిస్తాం.. వారికి పదవులు ఇచ్చి న్యాయం చేస్తాంమన్నారు.వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని పంచాయతీల్లో బిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే దొరకరు మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి జోస్యం చెప్పారు.