google-site-verification: google78487d974c7b676c.html
Local News

కెసిఆర్ మా కుటుంబాన్ని మోసం చేశారు. బిఆర్ఎస్ పార్టీని నమ్మి మోసపోవద్దు……

32.5KViews

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 11/02/2025 మంగళవారం సత్తుపల్లి పట్టణం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 11వ తేదీ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ బిఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న విధానాల పై  మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడ బిఆర్ఎస్ పార్టీ ని నమ్మి మోసపోవద్దు అని తెలిపారు. ఆ పార్టీ నాయకులు కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావు, చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు అలాగే మిగిలిపోయాయని, అభివృద్ధి మాత్రం సూన్యం అని అన్నారు.

ముఖ్య మంత్రి  రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఓర్వలేక కళ్ల ల్లో నిప్పులు పోసుకుంటున్నారని అన్నారు. కేటీఆర్ లగచర్లలో కిరాయి మనుషులతో రైతు ధర్నా పేరుతో రైతులపై ప్రేమ చూపిస్తున్నారు. రైతులపై అంత ప్రేమ ఉన్నప్పుడు గత పది సంవత్సరాలలో రైతులను ఎందుకు విస్మరించారని బిఆర్ఎస్ నాయకులను ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ప్రశ్నించారు.

ఈ కార్యక్రమం లో సత్తుపల్లి ఎంఎంసి చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహ రావు, చల్లగుళ్ల కృష్ణారావు, కమల్ పాషా,మాజీ వైస్ చైర్మన్ తోట సుజాల రాణి,కౌన్సిలర్స్  కంటే నాగలక్ష్మి,దూదిపాల రాంబాబు, నాగుల్ మీరా, నాయకులు మానుకోట ప్రసాద్, సారథి రెడ్డి, టోపీ శ్రీను మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్లోని పూర్తి వివరాలు ఈ క్రింది వీడియోలో చూద్దాం.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!