google-site-verification: google78487d974c7b676c.html
Daily News

మంత్రి తుమ్మల నాగేశ్వరావు జీవిత ఆశయం అదే…

11.5KViews

మన టివి6 న్యూస్ – పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూలై19 /25). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర సమీపంలోనాగార్జునసాగర్ కాలవలో ప్రవహిస్తున్న సీతారామ ప్రాజెక్టు ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలకు పెనుబల్లి మండల కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అభిమానులతో కలిసి శుక్రవారం పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడమే అపర భగీరధుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జీవిత ఆశయమని, ఆ ఆశయాన్ని సాధించి, సీతారామ ప్రాజెక్ట్ సాకార కల నెరవేర్చి రైతుల కళ్ళల్లో సంతోషం నింపిన అపర భగీరధుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అని అన్నారు.

సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేసి గోదావరి జలాలతో రైతుల కాళ్ళు కడుగుతా అని మాట ఇచ్చి, ఆఇచ్చిన మాటను నెరవేర్చిన మహా నాయకుడు మంత్రి తుమ్మల నాగేశ్వరావు అని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ అన్నారు .మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం, పులాభిషేకం చేసిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు.

సీతారామ ప్రాజెక్ట్ కి బడ్జెట్ కేటాయించిన రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్య మంత్రి బట్టికి, అహర్నిశలో శ్రమించి రైతుల నీటి కష్టాలు తీర్చిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రైతుల అందరి తరుపున ప్రత్యేక ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దంపతులు. త్వరలో రానున్న స్థానిక ఎన్నికల్లో ఎటువంటి వర్గ విబేధాలు లేకుండా కాంగ్రెస్ అభ్యర్థిని ఎన్నుకొని భారీ మెజారిటీతో గెలిపించి కోవాలి అని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, సోమరాజు సీతారామారావు, ఈడ కమలాకర్, ఆచంటి శ్రీనివాసరావు, మిట్టపల్లి కిరణ్, చీకటి చిన్న నరసింహారావు, మేకతోటి కాంతయ్య భూక్య ప్రసాద్, మల్లెల రాజా, వేముల కిరణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెనుబల్లి మండలం రైతు సోదరులు పాల్గొన్నారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!