మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13/04/2025 ఆదివారం).
ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య తుది శ్వాస విడిచారు. రామయ్య పార్థివ దేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన పాలేరు నియోజకవర్గ వుదయం ఆర్ సి గరిడేపల్లి మురళి. కోటికి పైన చెట్లు నాటిన రామయ్యను స్ఫూర్తిగా తీసుకుని నేటి సమాజంలోని యువత చెట్లు నాటడం అలవాటు చేసుకోవాలని మురళి అన్నారు.
వనజీవి రామయ్య చేస్తున్న చెట్లు నాటే కార్యక్రమం ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి రావడంతో రామయ్య చేస్తున్న కార్యక్రమాన్ని గుర్తించి అనేక విధాలుగా రామయ్యకు చంద్రబాబు నాయుడు సహాయసహకారాలు అందించారని అప్పుటి నుండే వనజీవి రామయ్య చేస్తున్న సేవలను ప్రజలు గుర్తించారని మురళి అన్నారు.
