
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 17-01-2025 శుక్రవారం). పాలేరు నియోజకవర్గం, ఖమ్మం రూరల్ మండలం రాజీవ్ గృహకల్పకు చెందిన సంజయ్ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించాడు. 17వ తేదీ శుక్రవారం మద్ధులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు.హరినాథ్ బాబు, మాజీ ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ మద్ది.మల్లా రెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ సంజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించి 10,000/- రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు.
సంజయ్ కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి, కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంజయ్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని పోలీస్ వారికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్.కిరణ్, ఖమ్మం రూరల్ మండల నాయకులు బానోత్.హరి నాయక్, శేష్ రెడ్డి, రాజీవ్ గృహకల్ప నాయకులు నగేష్, గోరేమియ, శ్రీను, చంద్రశేఖర్, మహేష్, రవి, నరేష్, గణేష్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.