తెలంగాణ వైద్య ప్రజా ఆరోగ్యశాఖ ఉద్యోగుల సంఘం హెచ్1 ఐ ఎన్ టి యు సి యూనియన్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూనియన్ డైరీ ఘనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారిని డాక్టర్ కళావతి భాయ్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులంతా బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వహించాలని, విధుల పట్ల గౌరవంతో ఉద్యోగులంతా కలిసికట్టుగా పనిచేసే జిల్లాకు తద్వారా మన రాష్ట్రానికి దేశంలో మంచి పేరు తీసుకురావాలి ఉద్యోగులను కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు జిల్లా ఇమినైజేషన్ అధికారి చందు నాయక్, జిల్లా మలేరియా అధికారి వెంకటరమణ , జిల్లా పాలన అధికారి మోతియా నాయక్ , డాక్టర్ బాబు రత్నాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సుదర్శన్, రాష్ట్ర జాయింట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షులు వి కృష్ణా రావు గారు సెక్రటరీ సందీప్, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్, నిర్మలా జ్యోతి ,ట్రెజరర్ శివ, సభ్యులు జ్యోతిరత్న, జానకి, రాజ్యలక్ష్మి కృష్ణవేణి రామకృష్ణ, గీత, రాజేశ్వరి, సుజాత, రేణుక, రాజమ్మ, బషీర్. తదితరులు పాల్గొన్నారు.
