మన టివి 6 న్యూస్ (మనప్రాంత వార్తలు మనకోసం 27/01/2025 సోమవారం). జనవరి 26వ తేదీ ఆదివారం ప్రజా పాలనలో భాగంగా రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి అందించారు. ఈ నాలుగు నూతన సంక్షేమ కార్యక్రమాలను కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి అనంతరం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్. పెనుబల్లి మండలం రామచంద్రపురం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు కరీముల్లా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డ్ లు, రైతు భరోసా మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఎమ్మెల్యే మట్టా దయానంద్ విజయకుమార్ దంపతులు ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పథకాల పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాగమయి దయానంద్ అందించారు. ఈ కార్యక్రమం లో కల్లూరు, పెనుబల్లి కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, వైస్ చైర్మన్ కోటేశ్వరరావు, ఆర్డీవో రాజేంద్ర గౌడ్, స్పెషల్ ఆఫీసర్, తాసిల్దార్ గంటా ప్రతాప్, ఎంపీడీఓ అన్నపూర్ణ, ఏపిఎం ప్రసన్న, ఏమో ప్రసాద్ రావు, ప్రభుత్వ అధికారులు,పెనుబల్లి మండలం పార్టీ అధ్యక్షులు, పెనుబల్లి మండలం నాయకులు పంది వెంకటేశ్వరరావు, రాజు బోయిన కోటేశ్వరావు దొంతు మాధవ, పసుమర్త్ విశ్వనాథ్, గ్రామ కాంగ్రెస్ నాయకులు, సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.