మన టివి6 న్యూస్ – ఖమ్మం రూరల్ మండలం (లోకల్ న్యూస్ జూలై 16/25).ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన శ్రీనివాస్ గౌడ్ కి ఘనంగా సంస్మరణ సభ పాలేరు ఇంచార్జ్ కొండబాల కరుణాకర్అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి టీటీడీ బోర్డు నెంబర్ నన్నూరి నరసిరెడ్డి, ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా నరసిరెడ్డి మాట్లాడుతూ టిడిపికి అంకితభావంతో పనిచేసిన నాయకులలో శ్రీనివాస్ గౌడ్ ఒకరని ఇలాంటి వ్యక్తిని పార్టీ కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్రంలోనే అన్న క్యాంటీన్ పెట్టి పేదలకు ఉచిత భోజనం అందించిన తొలి తెలుగుదేశం పార్టీ నాయకుడని అన్నారు. అంతేకాకుండా శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలను ఈ సందర్భంగా టిడిపి అభిమానులు నాయకులు కార్యకర్తలకు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు డిర్. వాసిరెడ్డి రామనాథం,రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి కూరపాటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు కాపా క్రిష్ణమోహన్ ఐటిడిపి హరిక్రిష్ణ , కూసుమంచి మండల అధ్యక్షుడు మందపల్లి కోటి ,ఖమ్మం మండలపార్టీ ప్రధాన కార్యదర్శి కోపుల్ల నాగేశ్వరావు, నేలకొండపల్లి మండల అధ్యక్షులు ఆర్కెట్ల కొండల్ రావు , ప్రధాన కార్యదర్శి నల్లమాస మల్లయ్య , తిరుమలాయపాలెం అధ్యక్షులు నామా ప్రసాద్ , కార్యదర్శి నరాటి బాలక్రిష్ణ, కొలిశెట్టి భిక్షం జిల్లా నాయకులు మల్లెంపాటి అప్పారావు , కేతినేని హరీష్ గడిపూడి వెంకటేశ్వర్లు, గుత్త సీతయ్య, పాలడుగు క్రిష్ణప్రసాద్ , నాగార్జున శ్రీనివాస్ రావు , పలసం వెంకటేశ్వర్లు నల్లమోతు సత్యనారాయణ , మల్లెంపాటి లహరిన్ , గరిపల్లి మురళి తాడిశెట్టి స్వాతి , మందపల్లి రజని , మంగమ్మ , కామా అనిత , కళ్యాణం రామారావు , దస్రు, అంగడాల భద్రయ్య, గుడిసె నరసింహారావు సైదులు, తేనే గోవీందు, షరీఫ్ , నాగిరెడ్డి. ఎన్టీఆర్ అభిమానులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.
