మన టివి6 న్యూస్ – సత్తుపల్లి (లోకల్ న్యూస్ జూన్ 29/25). హైదరాబాద్ సెక్రటేరియట్ లో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహని కలుసుకొన్న సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్.
ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గం లోని కల్లూరు, పెనుబల్లి నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఎమ్మెల్యే రాగమయి దయానంద్ వినతి పత్రం అందించారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు గురించి, సత్తుపల్లి 100 పడకల నూతన ప్రభుత్వ ఆసుపత్రి, నూతన నర్సింగ్ కాలేజీ మరికొన్ని సమస్యలు గురించి మంత్రి రాజనర్సింహతో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ చర్చించారు.
