మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 25/02/2025 మంగళవారం)ఖమ్మం జిల్లా కల్లూరు పోలీస్ డివిజన్ పరిధి ఏ సి పి రఘు మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని 25వ తేదీ మంగళవారం కొన్ని మార్గదర్శకాలను సూచించారు.
కల్లూరు పోలీస్ డివిజన్ పరిధిలోని ఏన్కూరు కల్లూరు పెనుబల్లి సత్తుపల్లి వేంసూరు మండలాల్లో పరమేశ్వరుని దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యంగా కల్లూరు మండల పరిధిలోని పుల్లయ్య బంజర శివాలయానికి వెళ్లే భక్తులకు, పెనుబల్లి మండలంలోని నీలాద్రిశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు దర్శనానికి వెళ్ళేటప్పుడు కొన్ని మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఏసీపీ రఘు తెలియజేశారు. అవేమిటో ఇప్పుడు రఘు గారి మాటల్లోనే చూద్దాం..
Source:mana tv6 news
Tags:డైలీ న్యూస్