మన టివి6 న్యూస్-పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూన్ 24/25). పెనుబల్లి మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలోమండల స్థాయి సదస్సు సిపిఎం కార్యదర్శి గాయం తిరపతిన అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. దేశంలో ఎమర్జెన్సీ నిర్వహించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆనాటి పరిస్థితులను సిపిఎం నాయకులు ఒకసారి గుర్తు చేసుకున్నారు.
ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్రావు పాల్గొని మాట్లాడుతూ, 1975 జూన్ 25న అత్యవసర ఎమర్జెన్సీ ప్రకటించడం ద్వారా ఆనాడు కవులను, పత్రికా స్వేచ్ఛ లేకుండా ప్రజా ఉద్యమాలను తొక్కేసే పద్ధతిలో కమ్యూనిస్టు నాయకులను జైలు పాలు చేసిన చరిత్ర చీకటి రోజులు గడప వలసి వచ్చింది. నేడు బిజెపి ప్రభుత్వం ఈ 11 సంవత్సరాల కాలంలో నయా ఫాసిస్టు విధానాలను, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని సగర్వంగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాలనని ఆయన అన్నారు. కానీ నేటి బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్పు చేస్తూ హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకు వస్తుందని,అప్రకటిత ఎమర్జెన్సీని నేటి ప్రభుత్వాలు అమలు చేస్తున్నారని, రానున్న కాలంలో దీనికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ పోరాటాలు చేయాలని, విఠల్రావు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు నల్లమల్ల అరుణ ప్రతాప్, తడికమల్ల. చిరంజీవి, చలమాల నరసింహారావు, మిట్టపల్లి నాగమణి, చిట్టి మొదల కృష్ణ, తాండ్ర.రాజేశ్వరరావు, నాగేశ్వరి, గుడిమెట్ల బాబు, పోట్రు రాజారావు, అన్నపురెడ్డి లక్ష్మయ్య, చిలిమంత సీతారాములు, మల్లెల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
