మన టివి6 న్యూస్-పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూన్ 25). మండల పరిధిలోని పెనుబల్లి మండలం. శ్రీ నీలాద్రిశ్వర స్వామి వారి దేవస్థానంలో విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం జేష్ట మాసం కృష్ణపక్షం. అమావాస్య 25 వ తేదీ సోమవారం స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విజయవాడకు చెందిన అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ వారు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి 11 రకముల ఇత్తడి హారతులు దేవాలయమునకు విరాళముగా ఇచ్చినారు.ఈ ప్రత్యేక పూజ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించారని ఆలయ కార్య నిర్వాహణాధికారి ఎన్ రజిని కుమారి తెలిపారు.

Source:mana tv6 news
Tags:డైలీ న్యూస్