మన టివి6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 23/05/2025 శుక్రవారం). తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పంచాయతీ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. సుమారు 1000 బిల్లులను ఒక్కసారే ఒకే రోజు క్లియర్ చేసింది.
గడిచిన బిఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామపంచాయతీలకు నిధులు ఎక్కువ మొత్తంలో పెండింగ్ ఉండడంతో సర్పంచులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వారికి ఊరట కలిగించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి వైకుంఠధామాలు, సిసి రోడ్లు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, డ్రైనేజీలు ఇలా అనేక రకాల పంచాయతీల్లో నిర్మించినటువంటి అభివృద్ధి పనులకు బిల్లులు రాక సర్పంచులు అనేక అవస్థలు పడుతున్నారు. 10 లక్షల రూపాయల లోపు ఉన్న బిల్లులు అన్నిటిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకేరోజు సుమారు153 కోట్లను విడుదల చేసింది.