google-site-verification: google78487d974c7b676c.html
Daily News

ఖమ్మం నగరానికి ధీటుగా మండల కేంద్రాన్ని అభివృద్ధి చేస్తాం….

39KViews

మన టివి6 న్యూస్ – కూసుమంచి (లోకల్ న్యూస్ జులై 04/25). కూసుమంచి మండలంలో ఖమ్మం ఎంపి రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం కూసుమంచిలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం చేశారు.

✅ధర్మతండా గ్రామంలో 36 లక్షలతో కూసుమంచి ఆర్ అండ్ బి రోడ్డు నుండి ధర్మతండా వరకు చేపట్టిన రోడ్డు మరమ్మతుల పనులకు, లోక్యాతండా గ్రామంలో
ఒక కోటి 26 లక్షలతో లోక్యాతండా నుండి ధర్మతండా వరకు, ఒక కోటి 16 లక్షలతో లోక్యాతండా నుండి అగ్రహారం వరకు చేపట్టిన రోడ్డు మరమ్మత్తు పనులకు, కోక్యాతండా గ్రామంలో 2 కోట్ల 90 లక్షలతో కోక్యాతండా నుండి వీర్యాతండా వరకు నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు, గన్యాతండా గ్రామంలో 3 కోట్ల 30 లక్షలతో గన్యా తండా నుండి మోటాపురం వీరన్న స్వామి టెంపుల్ వరకు నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు, కూసుమంచి గ్రామంలో 6 కోట్ల 50 లక్షలతో చేపట్టిన జంక్షన్ అభివృద్ధి పనులకు, ఖమ్మం – కోదాడ, కూసుమంచి, నేలకొండపల్లి పట్టణ పరిధిలోని కూసుమంచి, నేలకొండపల్లి రోడ్డు మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులకు ఈ రోజు శంకుస్థాపన చేశారు.

✅కూసుమంచి, నేలకొండపల్లి మండల హెడ్ క్వార్టర్ లలో 6 కోట్ల 50 లక్షల రూపాయలతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్, డివైడర్స్, జంక్షన్ అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తి చేస్తాం అని. ఖమ్మం నగరానికి ధీటుగా కూసుమంచి మండల హెడ్ క్వార్టర్ ను తయారు చేస్తాం అని, కూసుమంచి మండల హెడ్ క్వార్టర్ లో కోట్ల రూపాయలు ఖర్చుచేసి అంతర్గత రోడ్లు నిర్మించాం, త్రాగునీటి సరఫరా సమస్యలు పరిష్కరించాం, 50 లక్షల రూపాయలతో షాదీ ఖానా మంజూరు చేసుకున్నాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలను సుమారు ఐదున్నర కోట్ల రూపాయలతో మంజూరు చేశాం, త్వరలోనే శంకుస్థాపన చేస్తాం మని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు.

✅గత 18 నెలల కాలంలో ధర్మతండా గ్రామంలో 22 లక్షల రూపాయలతో అంతర్గత రోడ్లు పూర్తి చేశాం, 20 లక్షల రూపాయలతో గిరిజన శాఖ ద్వారా పలు అభివృద్ధి పనులు, లోక్యతండా గ్రామంలో 70 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు, 12 లక్షలతో అంగన్ వాడి కేంద్రాల అభివృద్ధి, 4 లక్షల రూపాయలతో త్రాగు నీటి సరఫరా పనులు, కొక్యా తండా లో 14 లక్షలు ఖర్చుపెట్టి సిమెంట్ రోడ్లు, 12.35 లక్షలతో అంగన్వాడీ భవనం, 10 లక్షలు ఖర్చు పెట్టి మంచినీటి సమస్య తీర్చాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు.

✅పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గత 18 నెలల కాలంలో సుమారు 1400 నుంచి 1500 కోట్ల రూపాయలతో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మంజూరు చేసుకున్నాం. ప్రజల దీవెనలతో రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడటం వలనే ఇంతటి అభివృద్ధి సాధ్యమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దిమా వ్యక్తం చేశారు.

✅గత పాలకులు అమలు చేసిన సంక్షేమం కొనసాగిస్తూ 200 యూనిట్లు ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం సరఫరా, నూతన రేషన్ కార్డుల జారీ, రెసిడెన్షియల్ హాస్టల్స్ లలో డైట్ చార్జీలు 40 శాతం పెంపు, కాస్మోటిక్స్ చార్జిలు 20 శాతం పెంచామని, రైతులకు 21 వేల కోట్ల రూపాయలతో 2 లక్షల రుణ మాఫీ చేశాం అని మంత్రి శ్రీనివాస్ రెడ్డి చేసిన అభివృద్ధిని గర్వంగా చెప్పుకొచ్చారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!