మన టివి6 న్యూస్ ( మన ప్రాంతం మన కోసం 10/02/2025 సోమవారం). గత కొన్ని రోజులుగా ఖమ్మం జిల్లా లోనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వనదర్శిని కార్యక్రమంలో పెనుబల్లి మండల పరిధిలోని పులిగుండాలు ఫారెస్ట్ ను తిలకిస్తున్నారు.
ఏన్కూర్ గురుకుల పాఠశాల విద్యార్థులు సుమారు 600 మంది పులిగుండాల ప్రాజెక్ట్ అటవీ ప్రాంతాన్ని సందర్శించి, అటవీ ప్రాంతంలో ట్రేక్కింగ్, నేచర్ ట్రయిల్ పై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు చెట్ల గూర్చి, సకల జంతువులు, జీవారసుల గూర్చి పద్మశ్రీ వనజీవి రామయ్య విద్యార్థులకు వివరించారు. అన్నం శ్రీనివాస్ విద్యార్థులకు మానవతా విలువలు, సేవా, చదువు మక్కువ పెంచుకోడం లో అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం లో ఎఫ్ ఆర్ ఒ జి ఉమా, డిఆర్ఓ సురేష్ కుమార్, డిఆర్ఓ రాంసింగ్, ఎఫ్ ఎస్ ఓ కాలు, ఎఫ్ బి ఓ లావణ్య, నాగరాజు, సమత, ప్రసాద లింగం, డి శ్రీను, అజామాలి, మస్తాన్, బేస్ క్యాంపు సుమన్, జూనీ, రాములు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు..మీ
