మన టివి6 న్యూస్-ఖమ్మం (లోకల్ న్యూస్ జూన్ 24/2025). ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ 2017 సివిల్స్ టాపర్, ఎక్కడ పని చేసినా ఆ ప్రాంతానికి వన్నెతెచ్చిన ఐఏఎస్, రాష్ట్ర ప్రభుత్వం చేత అనేక అవార్డులు స్వీకరించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించిన, అభినందించిన సిటీ కాంగ్రెస్ ఒబిసి చైర్మన్ బాణాల లక్ష్మణ్, విజయగిరి సదానంద చారి.
ఐఎఎస్ గా మీరు సాధించిన ప్రగతి, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందించాలని మీరు చూపే తపన, మీరు పనిచేసిన ప్రతి చోట పేరు ప్రఖ్యాతలు గడించారని అందరికీ తెలిసు. మీ ద్వారా మా ఖమ్మం జిల్లాకు కూడా అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆశిస్తూ, నూతన కలెక్టర్ అనుదీప్ కి శుభాకాంక్షలు తెలియ చేశారు.
