మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 21/04/2025 సోమవారం).ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలింగాల గ్రామంలో దేవరపల్లి పట్టాభిరామ్ నూతన గృహప్రవేశానికి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవితకు సత్తుపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు భారీ ఘన స్వాగతం పలికారు. స్వర్గీయ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీతోనే పోయిందని ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని వారు ఎద్దేవసేశారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలన లేకపోవడం వల్ల తెలంగాణ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆమె అన్నారు. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా రైతన్నలు గోడు పట్టించుకున్న దాఖలాలు లేవు అని వారు విమర్శించారు. రాబోయే కాలంలో మరల బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సండ్ర జోష్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానాలు ఒకటి కూడా అమలు పరచలేదని, కాంగ్రెస్ బుటకపు మాటాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఇస్తానన్న తులం బంగారం, ఆడపిల్లలకు స్కూటర్, నిరుధ్యోగ బృతి ఎమైందని ప్రశ్నించారు. ఆకాల వర్షాలు కురుస్తున్నా… జిల్లా మంత్రులులకు ఏ ఒక్క రైతు దగ్గరకు వెళ్ళే తీరిక లేదని, కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకాల వర్షాలకు నష్ట పోయిన రైతులకు 20 వేలు ఇచ్చి అదుకోవాలని డిమాండ్ చేశారు.
కేసిఆర్ పట్టించుకునేంత వరకు సీతారామ ప్రాజెక్టు గురించి పట్టించుకునే నాయకుడే లేడని అన్నారు. సత్తుపల్లి లో రాజకీయంగా ఎదిగిన నాయకులు సీతారామ ప్రాజెక్ట్ నిర్మించాటానికి ముందుకు రాలేదని పరోక్షంగా తుమ్మలని, పొంగులేటిని ఉద్దేశించి విమర్శలు చేశారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాత మధు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాలెపు రామారావు మాజీ ఎంపీపీ బీరవల్లి రఘు మాజీ జడ్పిటిసి సభ్యులు కట్టా అజయ్ కుమార్ దేవరపల్లి భాస్కరరావు దేవరపల్లి నాగప్రసాద్ అరుణ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.