మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 20/04/2025 ఆదివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో శనివారం రెండు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పనకుంట్ల ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరుకు చెందిన పల్లెల వీరభద్రరావు, తండ్రి చలపతిరావు ఇద్దరు మద్దుకూరులోని వారి బంధువుల ఇంటికి వచ్చి వెళుతూ ఉండగా కుప్పనకుంట్ల ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో కారు అదుపుతప్పి ప్రమాదం జరిగింది. తండ్రి కొడుకులు ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
విఎం బంజర్ లోనే హెచ్పి పెట్రోల్ బంక్ సమీపంలో సింగరేణి క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనం రోడ్డు మీద పెట్టిన బార్కేట్ ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజమండ్రి కి చెందిన నాగేశ్వరావు, వీరబాబు మండల పరిధిలోని లంకపల్లి గ్రామంలో సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ విఎం బంజర వచ్చి భోజనం ప్యాకెట్ తీసుకుని వెళుతున్న క్రమంలో సింగరేణి క్రాస్ రోడ్డు వద్ద పెట్టినటువంటి బార్కెట్ ను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది.
నాగేశ్వరావుకు తీవ్ర గాయాలు కాగా వీరబాబు కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆ సమయంలో రామచంద్ర రావు బంజర గ్రామానికి చెందిన మాణికుల బాలరాజు ప్రమాదాన్ని గమనించి గాయపడిన నాగేశ్వరావు పెనుబల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నాడు. మద్యం సేవించి ద్విచక్ర వాహన నడపడం వలనే ప్రమాదం సంభవించిందని చూసినవారు చెబుతున్నారు.
