మన టివి6 న్యూస్ – సత్తుపల్లి (లోకల్ న్యూస్ జూన్ 30/25).మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి హేయమైన చర్యగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దయానంద్ విజయకుమార్ ఆదివారం తీవ్రంగా ఖండించారు.
✒️ పత్రికా విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరం.
✒️ మీడియా ప్రసారాలు, కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే, వాటిని తెలియజేసేందుకు చట్టపరమైన మార్గాలు ఉన్నాయి.
✒️ మీడియా కార్యాలయాల పై దాడులు చేయడం సహించదగిన పరిణామం కాదు.
✒️ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాస్తవాలను ప్రజలకి వివరిస్తున్న మహా న్యూస్ కార్యాలయంపై దాడి చేయడం అప్రజాస్వామికం.
✒️ మహా న్యూస్ ఛానల్‌పై జరిగిన ఈ దాడిని అన్ని ప్రజాస్వామ్యవాద వాదులు ఖండించాల్సిన అవసరం ఉంది.
✒️ దాడికి పాల్పడిన వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు.
