మన టివి6 న్యూస్ – సత్తుపల్లి (లోకల్ న్యూస్ జూన్ 29/25). ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి పట్టణంలోని జామే మసీద్ కమిటీ వారి ఆధ్వర్యంలో మసీద్ లో ఏర్పాటుచేసిన ఉచిత హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్.
◆ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు.
◆ సత్తుపల్లి పట్టణ ప్రజలు కొరకు వారి ఆరోగ్య సంరక్షణ కోరుతూ ఇంతటి గొప్ప హెల్త్ క్యాంప్ నిర్వహించినందుకు సత్తుపల్లి జామే మసీద్ కమిటీ వారికి, హెల్త్ క్యాంపులో పాల్గొన్న డాక్టర్ల అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు.
◆ జామి మసీద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ క్యాంపులో ఎమ్మెల్యే రోగులకు స్వయంగా వైద్య పరీక్షలు నిర్వహించారు.

◆ సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్య సంరక్షణార్థం ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించే ప్రతి ఒక్కరికి స్థానిక ఎమ్మెల్యేగా, తోటి డాక్టర్ గా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడు అందజేస్తాము.
◆ మేము ఈరోజు ఎమ్మెల్యేగా గెలవడానికి కారణం కేవలం డాక్టర్లుగా మేము చేసిన సేవయే, దాని ఫలితంగానే ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచే ప్రజలకు సేవలు అందిస్తున్నాము.
◆ డాక్టర్ల వృత్తి అంటే చాలా పవిత్రమైనది. డాక్టర్లకు వారి వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి రోగులకు వైద్యం చేస్తూ ఉంటారు.
ఈ కార్యక్రమం లో సత్తుపల్లి ఎఎంసి చైర్మన్ దోమ ఆనంద్ బాబు, సత్తుపల్లి డాక్టర్స్ అశోక్ కుమార్, డాక్టర్ షేక్ మౌలాలి, డాక్టర్ వనమా లక్ష్మణ్ సాయి, సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజాల రాణి, సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సొసైటీ చైర్మన్ చల్లగుల్ల కృష్ణయ్య, సీనియర్ నాయకులు కమల్ పాషా, మాజీ కౌన్సిలర్ గ్రాండ్ మౌలాలి, మాజీ కౌన్సిలర్స్ దూదిపాల రాంబాబు, మందపాటి పద్మజ్యోతి, కాంగ్రెస్ మహిళా నాయకురాలు కుమారి,సత్తుపల్లి జామే మసీద్ కమిటీ సభ్యులు, సత్తుపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, సత్తుపల్లి పట్టణం, సత్తుపల్లి మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.














