మన టివి6 న్యూస్-హైదరాబాద్ ( మన రాష్ట్ర వార్తలు మనకోసం 08/06/2025 ఆదివారం). తెలంగాణ క్యాబినెట్ విస్తరణ నూతన మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ కొత్తగా నియమితులైన ముగ్గురు మంత్రులతో రాజ్‌భవన్‌లో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. నూతన మంత్రులుగా వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ ఉపసభాపతి (డిప్యూటీ స్పీకర్)గా రామచంద్రు నాయక్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… “నూతన మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి, శాసనసభలో ఉప సభాపతి బాధ్యతలు స్వీకరించబోతున్న రామచంద్రు నాయక్ అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.
రాజ్‌భవన్ దర్బార్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
