మన టివి6 న్యూస్ పెనుబల్లి మండలం. (మన ప్రాంత వార్తలు మనకోసం 09/06/2025 సోమవారం) పెనుబల్లి మండల కేంద్రంలోని విఎం బంజర్ లో సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులను ఆదివారం విఎం బంజర్ లోని అరుణోదయ మెరిట్ స్కూల్లో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మాదినేని రమేష్ ఘనంగా ప్రారంభించారు. పెనుబల్లి మండలం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరగతున్న ఈరాజకీయ శిక్షణ తరగతులు అఖిలభారత రాజకీయ తీర్మానాలను సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మాదినేని రమేష్ బోధించగా, సాయంత్రం తరగతులను సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బొంతు రాంబాబు పార్టీ కార్యక్రమం విశిష్టత గురించి కార్యకర్తలకు వివరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూకేంద్రంలో మూడుసార్లు అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ప్రజలపై అనేక ఆర్థిక భారాలను మోపిందని అన్నారు. మతతత్వ ఎజెండాతో రెచ్చగొడుతూ రాజకీయంగా లబ్ధి పొందే కుట్రలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేసి ప్రజలు ఆర్థిక అసమానతలను పెంపొందిస్తుందని ఈ సందర్భంగా వారు వివరించారు. పెట్టుబడుదారులకు 90 శాతం సంపదను దోచిపెట్టి సామాన్య ప్రజల, రైతుల ఆర్థిక వెనుకబాటు తనానికి కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తుంది అన్నారు. దేశంలో కార్మిక చట్టాలను కాలరాసి అసంఘటిత రంగాలను నిర్వీర్యం చేసేందుకు నాలుగు రకాల చట్టాలను రూపొందించి, వాటిని బిజెపిప్రభుత్వం అవలంబిస్తోందన్నారు. దేశంలో రైతులు పండిస్తున్న పంటకు గిట్టుబాటు ధర లేక వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిపోతుందని, మనదేశం నుండి ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్న అనేక రకాల వ్యవసాయ ఎగుమతులపై విదేశాలు పన్నులు విధించేందుకు కుట్రలు పన్నుతుంటే, కేంద్ర ప్రభుత్వం ఏమి పట్టనట్లు వ్యవహరిస్తుందని తెలియజేశారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనేక రంకాలుగా విఫలమైందన్నారు. ఆరు గ్యారెంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చి పథకాల అమల విషయంలో మల్లగుల్లాలు పడుతుందని ఏ ఒక్క హామీలను సక్రమంగా నెరవేర్చే పరిస్థితి లేక కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగటం లేదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టవేసిందని దాని కారణంగా నేడు అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలుగుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించటం పాలనపై పట్టు కోల్పోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు పార్టీ కార్యకర్తలు జాగ్రత్తగా వ్యవహరించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దోపిడీ విధానాలను ప్రజలకు అవగాహన కల్పించి ప్రజా పోరాటాల వైపు మరలించేందుకు కృషి చేయాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు, మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు, మండల కమిటీ సభ్యులు శాఖా కార్యదర్శులు మిట్టపల్లి నాగమణి, చెమట విశ్వనాథం, భూక్య ప్రసాద్, గుడిమెట్ల బాబు, రాజినేని మంగమ్మ, తడికమల చిరంజీవి, చిట్టిమాది కృష్ణ, సత్యం తదితరులు పాల్గొన్నారు.
