మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 12/05/2025 సోమవారం).ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గురవాయిగూడెం గ్రామంలో ఆదివారం అంగరంగ వైభోగంగా జరిగిన శిలా జీవద్వజ యంత్ర విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.
సండ్రకు ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ గురవాయిగూడెం గ్రామంలో చాలా గొప్పగా దైవ కార్యక్రమం జరగటం సంతోషంగా ఉందని, ఆ కోదండ రాముడు గ్రామ ప్రజలకు సుఖసంతోషాలు , అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నానని సండ్ర అన్నారు. ఈ కార్యక్రమంలో గుర్రం పురుషోత్తరావు, కమిటీ సభ్యులు, సండ్ర అభిమానులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.
