👉 ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా నోటీసు ఇవ్వని టౌన్ ప్లానింగ్ అధికారులు .
మన టివి6 న్యూస్ – రామగుండం (లోకల్ న్యూస్ జూలై 5/25). పెద్దపెల్లి జిల్లా రామగుండం, ఎన్. టి పి. సి , కృష్ణానగర్ లో గల ఇంటి నెంబర్ 5-1-216/3 పై న్యాయవాది సింగం జనార్ధన్ గత ఏడు నెలల క్రితం ఇంటి ముందర లక్ష్మీ నరసింహ గార్డెన్ ఆఫీసు అని బోర్డు పెట్టి రేకుల షెడ్డు అక్రమంగా నిర్మించగా దానిని వెంటనే తొలగించాలని నగలపారక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఇట్టి ఫిర్యాదుపై రామగుండం నగలపారక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకొనక పోగా, కనీసం నోటీసు కూడా జారీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని సింగం జనార్ధన్ ఆరోపించారు.
ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి అక్రమంగా నిర్మించిన షెడ్డుపై షో కాజ్ నోటి జారీ చేసి తొలగించవలసిందిగా మరొకసారి అధికారులను కోరుకుంటున్నాడు. సమాచార హక్కు చట్టం 2005 ద్వారా ఇట్టి ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయా అని నగరపాలక సంస్థ అధికారులను అడిగినప్పుడు టి ఎస్ బి పాస్ ద్వారా పొందమని తప్పించుకునే సమాధానం ఇచ్చారని జనార్ధన్ పేర్కొన్నారు.
