మన టివి6 న్యూస్ – ఖమ్మం రూరల్ (లోకల్ న్యూస్, జూలై 4/25). మండల పరిధిలోని నాయుడుపేట గ్రామానికి చెందిన సాగబోయిన శ్రీనివాసరావు గౌడ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి, ప్రస్తుతం ఖమ్మం రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు. తెలంగాణలోనే తొలి అన్న క్యాంటీన్ పెట్టి కొన్ని వేల మంది నిరుపేదలకు అన్నదానం చేసిన గొప్ప నాయకులు, కరోనా బాధితులకు, గత సంవత్సరం ఖమ్మం మున్నేరు వరదలు సమయంలో వరద బాధితులకు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు.

శ్రీనివాసరావు మూడో తేదీ గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఖమ్మం నుండి నాయుడుపేట వెళుతున్న క్రమంలో నాయుడుపేట సమీపంలో కస్తూరిబా స్కూలు వద్ద రోడ్డు ప్రక్కన ఆగి యూరిన్ పాస్ చేస్తూ ఉండగా లారీ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. తక్షణమే ఖమ్మం హాస్పిటల్కు తరలించి ప్రధమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలో మృతి చెందారు. శ్రీనివాసరావు ఆకస్మిక మృతితో జిల్లా టిడిపి నాయకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. నాయుడుపేట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.