మన టివి6 న్యూస్- ఖమ్మం (మన ప్రాంత వార్తలు మనకోసం 21/06/2025 ఆదివారం). మానసిక ప్రశాంతతకు, శారీరక ఉల్లాసానికి, మంచి ఆరోగ్యానికి యోగా.. దివ్య ఔషధం మాదిరిగా పనిచేస్తుందని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. శనివారం ఉదయం ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన సామూహిక యోగాసనాల కార్యక్రమానికి హాజరయ్యారు.
స్వయంగా యోగా ఆసనాలు వేసి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎంపి రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. యోగా అనేది ఆరోగ్యానికి ఒక క్రమ శిక్షణాయుతమైన దినచర్య అని అన్నారు. మన దేశంలో ఆరంభమైన ఈ యోగ కాలక్రమేణా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ప్రజాధరణ పొందిందన్ని అన్నారు. ప్రస్తుతం మన సమాజంలో మహిళలు సైతం ప్రత్యేక శ్రద్ధతో యోగా తరగతులు నిర్వహిస్తుండడాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో యోగా క్లాసుల నిర్వాహకులు శ్రీలత, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, మహిళా నాయకురాలు చల్లా ప్రతిభారెడ్డి, కార్పొరేటర్లు, టీఏసీ మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
