మన టివి6 న్యూస్ – వేంసూర్ మండలం (లోకల్ న్యూస్ జూలై 14/25). మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సోమిరెడ్డి ఇటీవల ప్రమాదవశాత్తు పాము కాటుతో అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ విజయకుమార్ తో కలిసి ఆదివారం సోమిరెడ్డిని పరామర్శించి మీకు మేమంతా ఉన్నామని భరోసా కల్పించి ధైర్యం చెప్పారు .
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి వేంసూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, వేంసూరు మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వెంకటాపురం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
