మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 21/03/2025 శుక్రవారం) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ రింగ్ సెంటర్ లో శుక్రవారం రాత్రి 7:30 నిమిషాలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
సత్తుపల్లి డిపోకు చెందిన TS04 UD 1819 నంబర్ గల పల్లె వెలుగు బస్సు ఖమ్మం నుండి సత్తుపల్లి వెళ్లే క్రమంలో వియం బంజర్ బస్టాండ్ లోకి టర్న్ తీసుకునే సమయంలో, వి.ఎం బంజర కు చెందిన మూడు కీరియా నడుచుకుంటూ వెళుతుండగా పల్లె వెలుగు బస్సు ఢీకొట్టడంతో కీరియా తలకు గాయాలు అయ్యాయి. తక్షణమే స్పందించిన స్థానికులు పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్లో డ్యూటి డాక్టర్, సిబ్బంది అప్రమత్తమై గాయాలు అయినటువంటి కిరియాకు ప్రథమ చికిత్స అందించారు.

Source:mana tv6 news
Tags:క్రైమ్ న్యూస్