మన టివి6 న్యూస్ (మన ప్రాంతం వార్తలు మనకోసం) ఈ నెల 21 నుండి 24 వరకు గ్రామాల్లో నిర్వహించేటటువంటి గ్రామసభల్లో ప్రజలు సంయమనం పాటించాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ అభివృద్ధి పథకాలు, సంక్షేమ ఫలాలు అందుతాయని, ఎవరు అధర్యపడొదని లబ్ధిదారులందరూ సమయానంతో వ్యవహరించాలని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఎవరు వ్యాఖ్యలు చేయొద్దని, ఒకవేళ అలా రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎవరైనా చేస్తే, అట్టి వారిపై చట్టం తన పని తాను చేసుకోతుందని ప్రతిపక్షాలను హెచ్చరించారు.
గ్రామసభల్లో పేరు రానీ వారు పక్కనే ఉండే హెల్ప్ డెస్క్ లో మరల అప్లికేషన్ పెట్టుకోవాలని కోరారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని అన్నారు. దయచేసి అందరు సంయమనం పాటించి అధికారులకు గ్రామసభల్లో సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
