మోడల్ స్కూల్లో విద్యా ప్రమాణాలు బేష్….విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్.మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 05/04/2025 శనివారం).పెనుబల్లి మండలంలోని టేకులపల్లి మోడల్ స్కూల్ గురువారం అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ చారి సందర్శించారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఆయన ఆకస్మిక తనిఖీ వచ్చారు.
ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరు పట్ల ప్రశంసించారు. పదవ తరగతి పరీక్షలు ముగియడంతో విద్యార్థులు వెళ్లిపోయారు. వచ్చే విద్యా సంవత్సరంలో మోడల్ స్కూల్లో లో విద్యార్థులు అధిక సంఖ్యలో చేరేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని వివరించారు. పాఠశాల నిర్వహణలో ఉపాధ్యాయులు కనపరిచిన ప్రత్యేక శ్రద్ధను, విద్యార్థుల క్రమశిక్షణలో ఉపాధ్యాయులు కనపరిచిన కృషిని అభినందించారు. వచ్చే విద్యా సంవత్సరంలో మోడల్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పించే విధంగా ఉపాధ్యాయులు అత్యుత్తమ శ్రద్ధ వహిస్తున్నారని ప్రిన్సిపాల్ టీ .రూపస్ డైరెక్టర్కు వివరించారు.
భవిష్యత్తులో టేకులపల్లి మోడల్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని డైరెక్టర్ శ్రీనివాసచారికి ఉపాధ్యాయులు తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నిర్వహణ సిబ్బంది పాల్గొన్నారు.
