మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 05/04/2025 శనివారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం విఎంజె రింగ్స్ సెంటర్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు సత్తుపల్లి వైపు నుండి ఖమ్మం వెళ్లే గ్రామంలో వి.ఎం బంజర్ రింగ్ సెంటర్లో టర్న్ తీసుకుంటున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో మండల పరిధిలోని పాత చిన్నమ్మగూడెం గ్రామానికి చెందిన బానోతు మారోణి కి (50 సం. భర్త బద్రు)
తలకు బలమైన గాయం కావడంతో గాయపడిన మారోణిని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కొన ఊపిరితో ఉన్న మారోణికి ఎండి రంజిత్ తన సిబ్బందితో కలిసి ప్రధమ చికిత్స అందించి సిపిఆర్ చేశారు. అయినా కానీ మారోణిని తుది శ్వాస విడిచింది.