మన టివి6 న్యూస్ – సత్తుపల్లి (లోకల్ న్యూస్ జులై 01/25). ఖమ్మం జిల్లాలోని అన్ని రైతు వేదికలలో మంగళవారం 10 గంటలకు రైతు నేస్తం కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రచారం చేసింది.
ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అగ్రికల్చర్ వ్యవసాయ అధికారి పుల్లయ్య పెనుబల్లి మండల కేంద్రంలోని రైతు వేదికను సందర్శించారు. ఈరోజు 10 గంటలకు ప్రారంభమైన రైతు నేస్తం కార్యక్రమాన్ని పుల్లయ్య రైతులతో కలిసి వీక్షించారు.

ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ రైతు నేస్తం కార్యక్రమం ద్వారా నిపుణులైన శాస్త్రవేత్తలతో మారుమూల గ్రామంలో ఉన్న రైతులు కూడా ముఖాముఖిగా మాట్లాడి తమతాము పండిస్తున్న పంట సస్యరక్షణ గురించి తెలుసుకోవచ్చని, రాష్ట్రంలో ఆదర్శవంతమైన రైతుల అనుభవాలను, వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి విప్లవాత్మకమైన మార్పులను తెలుసుకోవచ్చని అన్నారు. వ్యవసాయం చేసే రైతులు అందరూ ప్రతి మంగళవారం రైతువేదికలో జరిగే ఈ రైతు నేస్తం కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు ఇప్పుడు ఆ వివరాలు జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య మాటల్లోనే చూద్దాం….