google-site-verification: google78487d974c7b676c.html
Daily News

తెలంగాణ రాష్ట్ర ప్రజలను బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది…. ఎమ్మెల్యే రాగమయి దయానంద్.

75.5KViews

మన టివి6 న్యూస్ – సత్తుపల్లి (లోకల్ న్యూస్ జులై 01/25). ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో సోమవారం సాయంత్రం జరిగిన ప్రెస్ మీట్ లో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఇందిరమ్మ ప్రభుత్వంలో అటు అభివృద్ధి ఇటు సంక్షేమంలో రాష్ట్రం స్వస్యశ్యామలమవుతుంది ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అన్నారు.

➡️ అబద్ధాలు మోసాలతో గత పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలను మోసం చేసిన బిఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న ఇందిరమ్మ ప్రభుత్వం గురించి మాట్లాడటానికి బిఆర్ఎస్ నాయకులకు సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు.

➡️ నేడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఖమ్మం జిల్లా ముగ్గురు డైనమిక్ మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సహకారంతో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.

➡️ ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజే ఇచ్చిన మాట ప్రకారం భారతదేశంలోనే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని గుర్తు చేశారు.

➡️ రెండు లక్షల లోపు రుణాలు ఉన్న రైతులందరికీ రైతు రుణమాఫీ చేయటం ద్వారా రైతుల కళ్ళలో సంతోషం చూస్తున్నాం.

➡️ 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తూ మహిళల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం.

➡️ 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తూ ప్రతి కుటుంబంలో వెలుగులు నిప్పుతున్నాం.

➡️ మా ప్రభుత్వంలో ప్రతి పేదవాని కుటుంబం సన్నబియ్యంతో మూడు పూటలా కడుపునిండా అన్నం తినడం మాకు చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రాగ మీద అనంత సంతోషం వ్యక్తం చేశారు.

➡️ ప్రతి పేదవాడికి చిరకాల కోరిక అయినటువంటి సొంతింటి కలలను నెరవేర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం చేపట్టి ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్ల ఇచ్చి వారి అకౌంట్లో డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుందని అన్నారు.

➡️ రైతే దేశానికి వెన్నెముక అనే విధంగా వారు పండించిన సన్న రకం ధాన్యానికి కింటాకు 500 రూపాయలు చొప్పున రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇచ్చింది.

➡️ ఈరోజు రైతన్నలకు పెట్టుబడి సమయంలోనే కేవలం 9 రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రతి ఎకరానికి సంవత్సరానికి 12 వేల రూపాయల చొప్పున వారి అకౌంట్లో జమ చేసిన ఘనత మన ఇందిరమ్మ ప్రభుత్వానిదే.

➡️ హాస్టల్లో చదువుకునే విద్యార్థుల యొక్క మంచి ఆహారం కోసం డైట్ చార్జీలు పెంచి, వారికి పౌష్టికాహారం అందిస్తూ, ఆడపిల్లలకు 200% కాస్మోటిక్ చార్జీలు పెంచడంతో వారి కళ్ళల్లో ఆనందం ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ప్రతిపక్షాలను ప్రశ్నించారు.

➡️ మహిళా సాధికారత సాధించడం కొరకు మహిళా శక్తి ద్వారా డ్వాక్రా మహిళలకు బస్సులు, మహిళా శక్తి క్యాంటీన్, విద్యుత్ యూనిట్ లో, హాస్టల్ మెనూ కాంట్రాక్టు మహిళలకు కేటాయించడం, మహిళలు ఆర్థికంగా ఎదుగుదలకీ ప్రభుత్వం తోడ్పడుతుంది.ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేణుక చౌదరి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూవాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!