మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు 13/05/2025 మంగళవారం). సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని నీలాద్రి అర్బన్ పార్క్ లో 75 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా బోటింగ్, లైబ్రరీ, ఆర్ఒ ప్లాంట్, యన్ఐఎఫ్ మిషన్, చైన్ లింక్ పెన్సింగ్, యోగ షెడ్పనులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో ఎంపి రామసహాయం రఘు రాం రెడ్డితో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సోమవారం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమం లో ఐఎఫ్ఎస్ భీమా నాయక్, ఐఎఫ్ఎస్ సిద్దార్థ్ విక్రమ్ సింగ్, ఎస్ఎఫ్ఎస్ మంజుల, ఖమ్మం, సత్తుపల్లి అటవీ శాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, సత్తుపల్లి సింగరేణి పిఒ, కిష్టారం చేసి పిఒ, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నారావు, సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజాల రాణి, సత్తుపల్లి పట్టణ మాజీ కౌన్సిలర్స్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్,ఎన్ఎస్యుఐ నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.