పెనుబల్లి మండలంలో బంద్ విజయవంతం….మన టివి6 న్యూస్ – పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూలై 10/25).
📢 కార్మికులు 9వ తేదీ బుధవారం తలపెట్టిన సమ్మె, బంద్, మండలంలో విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసిన సిపిఎం నాయకులు. పెనుబల్లి మండల కేంద్రంలో విద్యాసంస్థలు, వ్యాపార వర్గాల వారు, బ్యాంకులు, మూసివేశారని, సమ్మెకు పూర్తిస్థాయిలో సహకారం అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు అన్నారు.

బందుకు అఖిలపక్ష కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిపిఎం, సిపిఐ, ఎమ్మెల్ మాస్ లైన్, టిఆర్ఎస్, టిడిపి, కాంగ్రెస్,ఎమ్మార్పీఎస్, పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించి సంఘీభావం ప్రకటించారు. ఆశా వర్కర్లు , అంగన్వాడి ఇబ్బంది, మధ్యాహ్న భోజన కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అమాలి కార్మికులు, గ్రామపంచాయతీ సిబ్బంది, వివిధ రకాల దుకాణాలలో పనిచేసే గుమస్తాలు, రిక్షా కార్మికులు, మోటర్ మెకానిక్ వర్కర్స్, రైస్ మిల్ లో పనిచేసే హమాలీ కార్మికులు, హాస్పటల్ శానిటేషన్ వర్కర్స్, వివిధ వర్గాలకు చెందిన కార్మిక వర్గం మొత్తం సమ్మెలో పాల్గొని, వి ఎం బంజర్ రింగ్ సెంటర్ నందు ప్రదర్శన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు గాయం తిరపతిరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ ను తక్షణమే రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 26 వేల రూపాయల కనీస వేతనాన్ని అమలు చేయాలని, అమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని, హాస్పటల్ శానిటేషన్ వర్కర్స్ కు వేతనాల తక్షణమే రిలీజ్ చేయాలని, గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ ఉన్న వేతనాలను విడుదల చేయాలని, మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వేత్తనాల తక్షణమే ఇవ్వాలని, అంగన్వాడి,ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, భావన నిర్మాణ కార్మికులకు పెండింగ్ పెండింగ్లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిశీలన చేయాలని, షాపుల్లో పనిచేసే గుమ్మస్తాలకు వేతనాలు పెంచాలని, లేబర్ కోళ్లను తక్షణమే రద్దు చేయాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు వంగా గిరిజాపతి రావు, మందడపు అశోక్, వేముల. నరసింహారావు, మల్లెల శ్రీనివాసరావు, పాల్గొని మాట్లాడుతూ సమ్మె విజయవంతం చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. సిపిఐ పొదిలి భాస్కర్, ఎమ్మెల్ మాస్ లైన్ జిల్లా నాయకులు బీరెల్లి లాజర్ మాట్లాడుతూ, కార్మిక వర్గాన్ని దెబ్బతీసే కార్మిక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని, హితవు పలికారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తుమ్మలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక వర్గానికి అండగా నిలబడతామని అన్నారు, ఎస్. డి.బాబు, పంతంగి వెంకటేశ్వరరావు, కోమటి కృష్ణా రావు, సిపిఎం నాయకులు చెమట విశ్వనాథం, తడికమళ్ళ చిరంజీవి, సత్యం, సిఐటియు నాయకులు తాండ్ర రాజేశ్వరరావు, గుడిమెట్ల బాబు, పోతిని సత్యనారాయణ, చిలక రామచంద్రుడు, హెల్త్ సూపర్వైజర్స్ యూనియన్ నాయకులు బి. నాగేశ్వరరావు, అంగన్వాడి యూనియన్ నాయకులుI. పద్మ రాజ్ కుమారి, కె.సుజాత, ఎం కృష్ణకుమారి , ఆశా వర్కర్స్ యూనియన్ శాంతా, శ్రీదేవి, నాగమణి, వెంకటరమణ, తిరుపతమ్మ, మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్ నాయకులు నీలమ్మ, రాధా ,హమాలి యూనియన్ నాయకులు మిద్దె స్వామి, అన్నపురెడ్డి లక్ష్మయ్య, జి.వెంకటేశ్వర్లు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కొప్పులు గోవిందరావు, బుడ్డియ్య, చందు, దొంతు , మాధవ, వెంకటేశ్వరరావు, ఆటో యూనియన్ నాయకులు మరీదు చంద్రశేఖర్, పుల్లారావు, వత్సవాయి శ్రీనివాసరావు, వేముల సురేష్, తదితరులు పాల్గొన్నారు.
