మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 23/02/2025 ఆదివారం)22వ తారీఖున ఖమ్మంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా యోగా సర్వసభ్య సమావేశం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రవి కిషోర్ సార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ పురోహిత్, జనరల్ సెక్రెటరీ సత్యా రెడ్డి హాజరయ్యారు.
ఈ సమావేశంలో టివైటిసిసి అధ్యక్షులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి యోగా గురువులైనటువంటి గుమలాపురం సత్యనారాయణని, ప్రధాన కార్యదర్శిగా చింతకింద రామకృష్ణకు, వైస్ ప్రెసిడెంట్ గా చల్లగుళ్ల అప్పారావును ఎన్నుకొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యోగా ప్రొఫెషనల్ మాస్టర్స్ అందరినీ కూడాను ఒక కూటమిగా ఏర్పాటుచేసి యోగ విద్యను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం, యోగ అనేది ప్రతి ఒక్కరికి పరిచయం చేయడంమే ప్రధాన లక్ష్యంగా యోగా మాస్టర్లు అందరూ కలిసి పనిచేయాలని టివైటిసిసి కార్యవర్గ సభ్యులు తెలియచేశారు.
