మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 23/02/2025 ఆదివారం). ఖమ్మంజిల్లా కూసుమంచి మండలం, నేలపట్ల గ్రామానికి చెందిన తాటికొండ రేణుకు అనే మహిళ హృదయ సంభంధిత శస్త్ర చికిత్స చేయించుకున్నది. శస్త్ర చికిత్స రేణుకకు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో 2.5లక్షలు సిఎం రిలీఫ్ ఫండ్ మంజూరైనది.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు సురేష్ నాయక్ రేణుక తరపున, నేలపట్ల గ్రామం తరపున మంత్రి పొంగులేటి కి కృతజ్ఞతలు తెలియజేశారు. రేణుక ఇంటి ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉండడం 22వ శనివారం సురేష్ నాయక్ ఆమెను పరామర్శించి 50కిలోల బియ్యం, నిత్యవసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు హఫీజుద్దీన్, కొరివి వెంకటరత్నం, టిపిసిసి అధికార ప్రతినిధి,మంకెన.వాసు,ఆత్మ కమిటీ డైరెక్టర్ మంచ్య నాయక్, ఎన్ పి.చారి ఆత్మ కమిటీ డైరెక్టర్,చిలకబత్తిని. రామారావు, కళ్లెం శేషీ రెడ్డి, బెల్లంకొండ కిరణ్ కుమార్. కొక్కిరేణి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
