మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 01/03/2025 శనివారం).పోక్సో చట్టం (POCSO Act) అనేది బాలబాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం ( ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ చట్టం) 2012 మే 22న భారత పార్లమెంటు ఆమోదించింది. 2012 నవంబరు 14 నుండి ఇది అమలులోకి వచ్చింది.
ఇలాంటి చట్టాలు ఎన్ని ఉన్నా కానీ ప్రతిరోజు దేశంలో ఎక్కడ ఒకచోట ఆడపిల్లలపై, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. 28వ తేదీ శుక్రవారం పెనుబల్లి మండలం విఎంబంజర్ పోలీస్ స్టేషన్ లో పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది.
మండల పరిధిలోని ఒక గ్రామంలో ఆరేళ్ల మైనర్ బాలికపై యువకుడు అత్యాచారయత్నం చేయడంతో స్థానికులు దేహశుద్ధి చేశారు. బాలిక తల్లిదండ్రులు విఎం బంజర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
