మన టివి6 న్యూస్ – ఖమ్మం రూరల్ ( మన ప్రాంత వార్తలు మనకోసం 21/05/1025 బుధవారం). తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా 20వ తేదీ మంగళవారం 26 కుటుంబాలకు రెండు లక్షల అరవై వేల రూపాయలు పంపిణీ చేశారు.
మంత్రి పొంగులేటి సొంత నియోజకవర్గంలో ఎవరైనా నిరుపేదలు మరణిస్తే వారి దహన సంస్కారాల కోసం 10 వేల రూపాయలు నిర్ణయించారు. దీనిలో భాగంగా మంగళవారంమంగళవారం మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ బైరు హరినాథ్ బాబు , కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గంలో వెంకటగిరి, గుదిమల్ల, గుర్రాలపాడు, తెల్దారుపల్లి, తల్లంపాడు, కామంచికల్ గ్రామాలకు చెందిన 26 కుటుంబాలకు రూ.10వేల చొప్పున రెండు లక్షల అరవై వేల రూపాయలను అందజేశారు. మరణించిన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు మంత్రి తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు మద్ది మల్లారెడ్డి, ధరావత్ రామ్మూర్తి నాయక్, అంబటి సుబ్బారావు , బండి జగదీష్, మద్ది కిషోర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కళ్లెం వెంకటరెడ్డి, నాయకులు మద్ది వీరారెడ్డి, బోడ వెంకన్న , కందుకూరి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
