ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా కాశ్మీర్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో అమరులు అయిన టూరిస్టుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిముషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ
ఈ నెల 27న నిర్వహించనున్న రజతోత్సవ సభను ఘన నిర్వహించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని సండ్ర విజ్ఞప్తి చేశారు.
మాజీ ఎమ్మెల్యే సండ్ర మాటల్లోని ప్రధానాంశాలు……
➡️ యాసంగి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని.
➡️ రోడ్లన్నీ ధాన్యంతో నిండిపోయాయి. మండుటెండలో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఒక పక్క ఆకాశం వైపు రెండో పక్కన ప్రభుత్వం వైపు చూస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం మాఊ రైతులకు వైపు మాత్రం చూడటలేదని అన్నారు.
➡️ పాలేరు నియోజకవర్గంలో కొండపల్లి లో మిల్లుకు తీసుకువెళ్లి ధాన్యం ఇప్పటికీ మూడు రోజులైన దిగుమతి కాలేదు
➡️ సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం పుల్లయ్య బంజర కొనుగోలు కేంద్రంలో లక్ష బస్తాల ధాన్యం ఈరోజుటికి నిల్వ ఉన్నాయి.
➡️ పెనుబల్లి మండలం ఏరుగట్లలో బిఆర్ఎస్ రైతుల ధాన్యం కాటా వేయడానికి వీల్లేదు అని గొడవ చేస్తున్నారు. బస్తాలను ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఉంచుట కరెక్ట్ కాదు.
కింటాకి 7 కేజీల తరుగు తీస్తున్నారు. మిల్లర్లు దగ్గర రైతాంగం ఇబ్బంది పడుతున్నారు.
➡️ డిసిఎంఎస్ కు యంత్రాంగం లేకపోయినా ఆ పేరుపైన కొనుగోలు కేంద్రాలు ఇచ్చి
కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను నడుపుతున్నారు.
➡️ రైతుబంధు వేయలేదు, రుణమాఫీ ఫెయిల్. ధాన్యం కొనుగోలు పైన దృష్టి పెట్టమని జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
➡️ తక్షణమే రైస్ మిల్లర్లకు కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేసి, బస్తాలను రాజకీయ జోక్యం లేకుండా ఇవ్వాలని డిమాండ్.
➡️ ధాన్యం కొనుగోలులో రాజకీయ నాయకులు జోక్యం ఎందుకక ? ఇందిరమ్మ కమిటీల పాత్ర ఎందుకు ?
